టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్‌లో బెన్‌ స్టోక్స్‌

టీ20, వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు తరచుగా సిక్సర్లు బాదేస్తుంటారు. అయితే టెస్టు మ్యాచ్‌లో చాలా అరుదుగా సిక్సర్లు చూస్తూంటాం. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌  

Published : 26 Jun 2022 01:28 IST

ఇంతకముందు ఇద్దరు మాత్రమే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20, వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు తరచుగా సిక్సర్లు బాదేస్తుంటారు. అయితే టెస్టు మ్యాచ్‌లో చాలా అరుదుగా సిక్సర్లు చూస్తుంటాం. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ మాత్రమే ఈ ఫార్మాట్‌లో 100 సిక్సర్లు కొట్టారు. తాజాగా హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో సౌథీ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి ఈ అరుదైన క్లబ్‌లో ఇంగ్లాండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ చేరాడు. టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచిన స్టోక్స్‌ త్వరలోనే  మెక్‌కల్లమ్‌ అత్యధిక సిక్సర్ల (107) రికార్డును అధిగమించేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ ప్రధాన కోచ్‌ మెక్‌కల్లమే కావడం విశేషం.  వీరేంద్ర సెహ్వాగ్‌  180 ఇన్నింగ్స్‌ల్లో 91 సిక్సర్లు బాది మన దేశం తరఫున టాప్‌లో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్‌ 5 బ్యాటర్లు వీరే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని