Crime News: ఇద్దరిని మింగేసిన సెల్లార్‌ గుంత... మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులు

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో సెల్లార్‌ పనులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సాయంతో రెండు మృతదేహాలను

Updated : 25 Jun 2022 22:42 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో సెల్లార్‌ పనులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సాయంతో రెండు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు శ్రీకాకుళానికి చెందిన ప్రసాద్‌, వెంకటరమణగా గుర్తించారు. నిర్మాణసంస్థపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తమకు సమాచారం వచ్చిందని, వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టామని నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ వివరించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో 13 మంది కార్మికులు పనిచేస్తున్నారని, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోందన్నారు. ఘటనలో మొదట ముగ్గురు కూలీలు చిక్కుకున్నారని భావించారు. మట్టి కింద ఇంకా ఎవరూ లేకపోవడంతో పాటు ఈరోజు 13 మంది పనిలోకి రాగా 11 మంది అక్కడ ఉన్నారని గుర్తించారు. మిగతా వారి గురించి ఆరా తీసి ఇద్దరు మాత్రమే మృతిచెందినట్టు నిర్ధారణకు వచ్చామని ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని