close


రాశిఫలం

రాశి ఫలం

గ్రహ‌బ‌లం (డిసెంబర్ 9 - డిసెంబర్ 15) 
డా॥ శంక‌ర‌మంచి రామ కృష్ణ శాస్త్రి

మేషం 

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
అర్థలాభం, ప్రయత్నపూర్వక విజయం ఉన్నాయి. పనుల్లో తోటివారి సలహాలు అవసరమవుతాయి. సమష్టి కార్యాలు విజయాన్నిస్తాయి. ఖర్చు పెరుగుతుంది. కొందరు మోసం చేసే అవకాశముంది. బుద్ధిబలంతో ఆపదలు తొలగుతాయి. ఒక విషయంలో సానుకూల ఫలితం వస్తుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. శివారాధన శుభాన్నిస్తుంది.

వృషభం

కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు 
విఘ్నాలను అధిగమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. చెడు ఊహించవద్దు. కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంటుంది. అపనిందలు ఎదురయ్యే సూచన ఉంది. అపార్థాలకు తావివ్వకుండా వ్యవహరించండి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. ఈశ్వరారాధన శ్రేయస్సునిస్తుంది.

మిథునం

 మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
గొప్ప శుభయోగాలున్నాయి. అనుకూల కాలం నడుస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్వర విజయాన్నిస్తాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి సూచితం. వస్త్ర, వాహనాది లాభాలున్నాయి. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నలుగురికీ మీ వల్ల మేలు జరుగుతుంది. రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. 
 
కర్కాటకం 

పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష 
అదృష్టం వరిస్తుంది. సమస్యలు తొలగుతాయి. అనుకున్న ఫలితం దక్కుతుంది. గతంకంటే బాగుంటుంది. ఒక గొప్ప కార్యం పూర్తి అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులకు విజయం చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

సింహం 

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
సహనంతో విజయం లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా గోచరిస్తుంది. మొండిగా వ్యవహరించవద్దు. గృహ వాహనాది యోగాలున్నాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

కన్య 

ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు 
విజయం అతిచేరువలో ఉంది. ఓర్పు, సహనంతో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. పెద్దలను మెప్పిస్తారు. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఎవరినీ విమర్శించవద్దు. భూలాభం సూచితం. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మాభిమానం అడ్డురావడం వల్ల కొన్ని పనులు ఆగుతాయి. శుభయోగాలున్నాయి. విష్ణుస్తుతి మేలు చేస్తుంది.

తుల 

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
శీఘ్ర విజయం లభిస్తుంది. దైవబలంతో ఒక పని పూర్తి అవుతుంది. అంచెలంచెలుగా వృద్ధి చెందుతారు. సొంతంగా తీసుకునే నిర్ణయం లాభాన్నిస్తుంది. ఆపదలు తొలగుతాయి. మనోబలం రక్షిస్తుంది. నిదానంగా పనులు చేయండి. తొందరపాటు చర్యల వల్ల ఇబ్బందులొస్తాయి. ఆర్థికంగా 
అనుకూల కాలం. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఆదిత్య హృదయం చదవండి.

వృశ్చికం 

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ 
ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పు విజయాన్నిస్తుంది. సహనాన్ని పరీక్షించే కాలమిది. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. కార్యాలు సిద్ధిస్తాయి. దగ్గరివారిని సంప్రదించి పనుల్లో ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. నవగ్రహ స్తోత్రం పఠించండి.

ధనుస్సు 

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
స్వల్ప ప్రయత్నంతోనే విజయం చేకూరుతుంది. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అదృష్టం కలిసి వస్తుంది. మొహమాటంతో కొన్ని ఇబ్బందులొస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. 
ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మకరం 

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఉద్యోగంలో లాభముంది. పదవీ యోగముంటుంది. వ్యాపార పరంగానూ కలిసివచ్చే కాలం. అప్రయత్నంగా ఒక విషయంలో విజయాన్ని పొందుతారు. కాలం సహకరిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. మిత్రుల అండదండలు లభిస్తాయి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. వెంకటేశ్వరసామిని దర్శించండి.

కుంభం 

ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
చేపట్టే పనుల్లో శీఘ్ర విజయముంది. మనసుపెట్టి పనులు ప్రారంభించండి. ఇంటా బయటా మీదే పైచేయి అవుతుంది. గత వైభవం లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో లాభముంటుంది. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. విఘ్నాలున్నా పెద్ద ఇబ్బందేమీ లేదు. వివాదాలున్నాయి. మౌనంగా ఉంటే ఏ సమస్యా రాదు. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్ఠం.

మీనం

 పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
మంచి శుభయోగముంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి. ప్రతి నిమిషమూ అదృష్టాన్నిస్తుంది. కాలాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత ఉత్తమ ఫలితం వస్తుంది. దగ్గరి వారి సహాయ సహకారాలందుతాయి. వ్యతిరేకతలున్నా ఆశయం సిద్ధిస్తుంది. స్థిరమైన సంపద 
లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థితిని పొందుతారు. ఇష్టదైవాన్ని దర్శించండి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు