close

పార్టీలే వేరు.. ప్రచారానికి వారే 

న్నికల ప్రచారంలో దాదాపు అన్ని పార్టీలూ అద్దె కార్యకర్తలపైనా ఆధారపడ్డవే. చాలా ప్రాంతాల్లో ఉదయం ఓ అభ్యర్థి వెంట, సాయంత్రం మరో అభ్యర్థి వెంట తిరుగుతూ కొంత మంది జనం రెండు పూటలా సంపాదించుకున్నారు. ఇదే పరిణామం బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండల కేంద్రంలో ఓ సమస్యకు కారణమైంది. ఉదయం తెరాస నాయకులు జనాన్ని పోగుచేసి ప్రచారం నిర్వహించారు. వారికి మధ్యాహ్నం ఓ కల్యాణ మండపంలో భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తుందని.. అప్పటివరకు అక్కడే ఉండాలని మండపం గేటు మూసివేశారు. సాయంత్రం ప్రజాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డి ప్రచారానికి వచ్చారు. జనాన్ని పోగు చేద్దామంటే ఎవరూ దొరకలేదు. కాంగ్రెస్‌ నేతలు అసలు విషయం తెలుసుకుని.. పోలీసులు, పాత్రికేయులకు సమాచారం అందించారు. మండపానికి పాత్రికేయులు రావడం చూసి.. తెరాస నాయకులు గేటును తెరిచారు. చిన్నారెడ్డి ప్రచారానికి ఎవరూ వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే వారు జనాలను అలా ఆపారని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.

- న్యూస్‌టుడే, ఖిల్లాగణపురం

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు