close

రెండు సమస్యలు.. ఒక పరిష్కారం! 


ఊబకాయానికి చికిత్స చేస్తే.. మధుమేహం నియంత్రణ 
బరువు తగ్గించే శస్త్రచికిత్సతో రెండు ప్రయోజనాలు 
అధిక బరువు ఉన్నవారిలోనే సానుకూల ఫలితాలు 
తెలుగు రాష్ట్రాల్లో ఏటా 1500 వరకూ ఇలాంటి చికిత్సలు 
80 శాతానికి పైగా విజయవంతమంటున్న నిపుణులు 
నేడు ప్రపంచ ఊబకాయ నివారణ దినం 
ఈనాడు - హైదరాబాద్‌ 

హారపు అలవాట్లు మారిపోవడం.. శారీరక వ్యాయామం తగ్గిపోవడం.. మానసిక ఒత్తిళ్లు పెరిగిపోవడం.. వీటన్నింటి ఫలితం.. ఊబకాయం! తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే-4 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క ఊబకాయం ఉంటే చాలు అనేక రుగ్మతలు దాడిచేసే అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతుల్లో ప్రయత్నించి కూడా ఊబకాయాన్ని తగ్గించుకోలేని పరిస్థితుల్లో.. ‘బేరియాట్రిక్‌ సర్జరీ’ ద్వారా బరువును తగ్గించుకోవడానికి కొందరు మొగ్గుచూపుతున్నారు. వీటి వలన బరువు తగ్గడంతో పాటు.. అధిక బరువు వలన కలిగే ఇతర దుష్ఫలితాలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. ఉదాహరణకు మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపై ఒత్తిడి పెరగడం, మహిళల్లో సంతానలేమి, అండాశయాల్లో నీటిబుడగలు ఏర్పడడం, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం, ముఖంపై నల్లని చారలు ఏర్పడడం, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరగడం వంటి వన్నీ కూడా అధిక బరువు వల్ల వచ్చే అనుబంధ రుగ్మతలు. ఊబకాయాన్ని తగ్గించే శస్త్రచికిత్స అనంతరం ఇలాంటివన్నీ తగ్గుముఖం పట్టాయని అమెరికన్‌, బ్రిటన్‌ బేరియాట్రిక్‌ సర్జరీ అసోసియేషన్లు గుర్తించాయి.

ఒకవైపు ఊబకాయంతో ఉక్కిరిబిక్కిరి.. మరోవైపు మధుమేహంతో సతమతం. ఇటు అధిక బరువును తగ్గించుకోలేక.. అటు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోలేక అవస్థలు పడేవారు ఎందరో! అలాంటి వాళ్ల కోసమే ఆధునిక వైద్యంలో సరికొత్త శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఒకే శస్త్రచికిత్సతో రెండు సమస్యలకు పరిష్కారాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయాన్ని తగ్గించడానికి చేసే బేరియాట్రిక్‌, మెటబాలిక్‌ శస్త్రచికిత్స వల్ల ఇప్పుడు మధుమేహమూ నియంత్రణలోకి వస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. శరీర జీవక్రియల్లో సమూల మార్పులు చేయడం వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయని తేటతెల్లమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఇలాంటి శస్త్రచికిత్సలు దాదాపు 1500కి పైగా జరుగుతున్నట్లు అంచనా. వాటిలో దాదాపు 80 శాతానికి పైగా విజయవంతమవుతున్నట్లు వైద్యనిపుణులు వెల్లడించారు.

ఎలా తగ్గుతుంది? 
ఇందులోనూ జీఎల్‌పీ1 ఉత్పత్తి జరిగి క్లోమగ్రంధి ప్రేరేపితమవుతుంది. 
ఈ శస్త్రచికిత్సలో చిన్నపేగు చివరి భాగాన్ని తీసుకొచ్చి చిన్నపేగు మొదటి భాగంలో జతపర్చడం వల్ల.. చిన్నపేగుకు పెద్దగా కోత పెట్టాల్సిన అవసరం ఉండదు.

ఫలితంగా చిన్నపేగు పనితీరు యథాతథంగా జరిగి.. పోషకాహార లోపమూ తలెత్తదు. 
ఇందులో కాలేయానికి ప్రత్యేకంగా చికిత్స చేస్తారు. ఎందుకంటే రక్తం నుంచి చక్కెర స్థాయిని తొలగించడంలో కాలేయం పనిచేస్తుంది.

తనలో చక్కెరను నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు విడుదల చేస్తుంది. 
ఎప్పుడు స్వీకరించాలి? ఎప్పుడు విడుదల చేయాలనే గ్రహణ శక్తి కాలేయానికి ఉంటుంది.

కాని అధిక బరువు కారణంగా కాలేయానికి కొవ్వు ఎక్కువగా చేరినప్పుడు కాలేయం ఆ గ్రహణ శక్తిని కోల్పోతుంది. దీంతో రక్తంలోకి చక్కెరను నిరంతరాయంగా పంపిస్తుంటుంది. మధుమేహం అదుపు తప్పడానికి ఇదో కారణమవుతుంది.

దీన్ని తగ్గించడానికి కాలేయానికి వెళ్లే నరాలనూ ‘ఇలియం ఇంటర్‌ పొజిషన్‌’ శస్త్రచికిత్సలో భాగంగా ప్రేరిపిస్తారు. 
దీంతో కాలేయ గ్రహణ శక్తి తిరిగి పునరుత్తేజమవుతుంది. రక్తంలోంచి చక్కెరను స్వీకరించడాన్ని, విడుదల చేయడాన్ని క్రమబద్ధీకరిస్తుంది.

ఎవరికి చేయకూడదు? 
క్లోమం పనితీరు అస్సలు బాగోలేక.. దాన్నుంచి అసలు ఇన్సులిన్‌ ఉత్పత్తి కాని పరిస్థితుల్లో.. ఊబకాయులైనా వారికి ఈ శస్త్రచికిత్స చెయ్యరు. 
ఇలాంటి వారిలో బరువు తగ్గించడానికి ఈ శస్త్రచికిత్స ఉపయోగపడుతుందే గానీ.. మధుమేహం తగ్గడానికి ఏమాత్రం ఉపయోగపడదు.


 

ఎవరికి చేస్తామనేది చాలా ముఖ్యం 
- డా।। మహీధర్‌ వలేటి, బేరియాట్రిక్‌ సర్జన్‌

ఊబకాయం.. అదుపులో లేని మధుమేహం.. ఈ రెండూ ఉన్నప్పుడు ఈ శస్త్రచికిత్సలు ప్రయోజనకరం. మధుమేహం లేనివారికి 35 కంటే ఎక్కువగా బాడీ మాస్‌ ఇండెక్స్‌ (ఎత్తుకు తగ్గ బరువును సూచించేది-బీఎంఐ) ఉంటే.. బరువు తగ్గించే శస్త్రచికిత్సలు చేస్తాం. ఇంకా సాధారణ భాషలో చెప్పాలంటే ఉండాల్సిన బరువు కంటే 25 కిలోలు ఎక్కువగా ఉంటే బరువు తగ్గే శస్త్రచికిత్స చేస్తాం. అదే మధుమేహుల్లో అయితే.. ఉండాల్సిన బరువు కంటే 16-17 కిలోలు ఎక్కువున్నా సరే బరువు తగ్గించే శస్త్రచికిత్సను చేసేయొచ్చు. అదే సమయంలో తగినంత బరువు మాత్రమే ఉన్న మధుమేహులకు ఈ సర్జరీ చేయకూడదు.

శాస్త్రీయంగా నిరూపితమైంది 
- డా।। లక్ష్మి, బేరియాట్రిక్‌ సర్జన్‌

టైప్‌ 2 మధుమేహుల్లో అధిక బరువును తగ్గించే శస్త్రచికిత్స చేయడం వల్ల మధుమేహం తగ్గడానికీ దోహదపడుతుంది. శరీరంలో కొవ్వు శాతం పెరుగుతున్న కొద్దీ ఇన్సులిన్‌ నిరోధకత కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. బేరియాట్రిక్‌ సర్జరీలో కొవ్వు తగ్గిపోతుంది. అదే క్రమంలో ఇన్సులిన్‌ నిరోధకత కూడా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన ఇన్సులిన్‌ ఉత్పత్తి జరుగుతుంది.

మధుమేహుల కోసమే ప్రత్యేక సర్జరీ 
- డా।। సురేంద్ర ఉగాలె, మెటబాలిక్‌ సర్జన్‌

మన దగ్గర 27.5 కంటే ఎక్కువ బీఎంఐ ఉన్నవారికి కూడా శస్త్రచికిత్సలు చేస్తున్నాం. ఇలియం ఇంటర్‌ పొజిషన్‌ అనేది ఇప్పుడు ఉపయోగిస్తున్న కొత్త విధానం. ఇది ప్రత్యేకంగా మధుమేహుల కోసమే రూపొందించిన సర్జరీ. ఇందులో పోషకాహార లోపం సమస్య కూడా ఉండదు. ఈ శస్త్రచికిత్స తర్వాత సాధారణ స్థితికి రావడానికి కొందరికి రెండు వారాలు.. మరికొందరికి ఆరేడు వారాలు కూడా పట్టొచ్చు. కానీ తర్వాత అంతా సర్దుకుంటుంది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు