close

‘ఒకరోజు’ రాయబారులుగా తెలుగమ్మాయిలు 

నెదర్లాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్వీడన్‌లకు.. 
పసుపులేటి, శ్రావణి, సాయిశ్రుతికి అరుదైన గౌరవం 
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నేడు దిల్లీలో బాధ్యతలు 

ఈనాడు, హైదరాబాద్‌:  తెలుగమ్మాయిలకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌కు చెందిన పసుపులేటి, సికింద్రాబాద్‌కు చెందిన శ్రావణి, సాయిశ్రుతి నెదర్లాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌, స్వీడన్‌లకు ఒకరోజు రాయబారులుగా నియమితులయ్యారు. అక్టోబరు 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వీరు గురువారం బాధ్యతలు నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణ, ఉద్యోగులకు బాధ్యతల అప్పగింత, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దిల్లీలో వేర్వేరు దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ఉన్నాయి. పది రాష్ట్రాల నుంచి 17 మంది బాలికలను ఎంపిక చేసిన ప్లాన్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ సమానత్వం కోసం ఒకరోజు రాయబారుల కార్యక్రమం చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో వెయ్యి మంది బాలికలు లింగ సమానత్వం ప్రచారోద్యమంలో పాల్గొనబోతున్నారు. అసమానతలపై తమ సందేశం వినిపించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకున్నప్పుడే వారి హక్కులను సాధించుకోగల్గుతారని, విద్యతోనే ఏదైనా సాధ్యమని పసుపులేటి తెలిపారు. బాలికలపై దూషణ, ఈవ్‌టీజింగ్‌, వరకట్న వేధింపులు దేశం నుంచి తొలగిపోవాలని శ్రావణి అన్నారు. మహిళలను ఇంటికే పరిమితం చేయకుండా కోరుకున్న రంగంలో రాణించేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని సాయిశ్రుతి అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు