close

దంత వైద్య పరీక్షలో గిన్నిస్‌ రికార్డు 

విజయవాడ, న్యూస్‌టుడే: విజయవాడలో బుధవారం కేవలం 9 గంటల్లోనే 21,233 మందికి దంత పరీక్షలు నిర్వహించడం ద్వారా గిన్నిస్‌ రికార్డులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుజరాత్‌ను అధిగమించింది. 2016లో ఆ రాష్ట్రం 24 గంటల్లో 14,978 మందికి దంత వైద్య పరీక్షలు జరిపింది. డాక్టర్‌ శ్రీధర్‌ ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ, కృష్ణా జిల్లా పరిపాలన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రా లయోల కళాశాల దేవయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎంపీ కేశినేని నాని, కలెక్టర్‌ లక్ష్మీకాంతం, డాక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి ప్రారంభించారు. గుజరాత్‌ రికార్డును అధిగమించినట్లుగా గిన్నీస్‌ ప్రపంచ రికార్డు ప్రతినిధి స్వప్నిల్‌ డాంగ్రేకర్‌ నిర్వాహకులకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. సాయి ఓరల్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎ.ఎస్‌.నారాయణను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. హైదరాబాద్‌కు చెందిన ఆచార్య నారాయణకు వెయ్యికి పైగా శిబిరాలు నిర్వహించగా 21లక్షల మందికి దంత పరీక్షలు చేసిన ఘనత ఉంది. ఓరల్‌ మాక్సిలో ఫేషియల్‌ సర్జన్‌ సి.కె.ధనశేఖరన్‌ను జీవన సాఫల్య అవార్డులతో సత్కరించారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు