close

ఇక్కడ రూ.10కే ‘ఫుల్లు’ బాటిల్‌ 

మాదాపూర్‌ సిటీ వైన్స్‌లో వినూత్న పద్ధతిలో పంపిణీ 
కొత్త దారిని ఎంచుకున్న అభ్యర్థులు 

క్కడ రూ.10 ఇస్తే చాలు రూ.460 ఫుల్‌ బాటిల్‌ మద్యం ఇచ్చేస్తారు. రూ.50 ఇచ్చారంటే రూ.600 మద్యం సీసా ఇస్తారు. ఇంతకంటే నాణ్యమైన మద్యం కావాలంటే రూ.100 ఇవ్వాలి అప్పుడు రూ.1000 మద్యం సీసా లభిస్తుంది. ఎన్నికల తేదీ దగ్గర పడటంతో కొందరు రాజకీయ నాయకులు మద్యం పంపిణీ చేపట్టేందుకు ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. మాదాపూర్‌లోని సిటీ వైన్స్‌లో అతి చవగ్గా మద్యం లభిస్తోంది. అది కూడా ఎవరికి పడితే వారికి కాదు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్‌ నెంబరు సరిపోలితేనే ఈ బంపర్‌ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. దీని గురించి తెలుసుకున్న మాదాపూర్‌ పోలీసులు నిందితులను బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సిటీ వైన్స్‌ మేనేజరు ప్రవీణ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వై.నాగేశ్వర్‌రావు తెలిపారు.

- న్యూస్‌టుడే, మాదాపూర్‌

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు