close

కోటి దాటిన కంటి పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కంటి వెలుగు పథకం కింద నేత్ర పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య సోమవారం నాటికి కోటి దాటింది. ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమవగా..ఈ నెల 3వతేదీ నాటికి 1,00,02,544 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని వైద్యారోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 7,70,797 మంది పరీక్షలు చేయించుకున్నారని, 1,19,118 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో 6,31,244 మంది, రంగారెడ్డి- 6,28,562, అతి తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,71,877 మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు వెల్లడించారు. 
పథకం తీరూ తెన్నూ..

మొత్తం కంటి వైద్య శిబిరాలు: 827 బీ పరీక్షలు చేయించుకున్న వారు: 1,00,02,544 బీ సాధారణ కళ్లద్దాలు పొందిన వారు: 16,66,171 బీ శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించిన వారి సంఖ్య: 6,72,112.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు