close

జస్టిస్‌ కైత్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు 

న్యాయసేవలను కొనియాడిన సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కైత్‌ దిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ ఆధ్వర్యంలో బుధవారం మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ కైత్‌ మాట్లాడారు. హైదరాబాద్‌ హైకోర్టులో పనిచేయడం చాలా తృప్తినిచ్చిందన్నారు. వృత్తిపరంగా సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు సీజే రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ..జస్టిస్‌ కైత్‌ అందించిన న్యాయసేవలను గుర్తుచేశారు. తెలంగాణ అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌, హైకోర్టు ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు జస్టిస్‌ సురేష్‌కుమార్‌ అందించిన సేవలను ప్రస్తావించారు. కార్యక్రమంలో జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కైత్‌ కుటుంబ సభ్యులు, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాది సంఘాలు జస్టిస్‌ కైత్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. న్యాయవాది సంఘాల ప్రతినిధులు జస్టిస్‌ కైత్‌ దంపతులకు జ్ఞాపికను అందజేశారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు