close

నేటి నుంచి భీమా పుష్కరాలు 

కృష్ణా, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో కర్ణాటక సరిహద్దున ఉన్న భీమానది పుష్కరాలు గురువారం సాయంత్రం 7.03 గంటలకు ప్రారంభం కానున్నాయి. పుష్కరఘాట్ల నిర్మాణ విషయంలో గుత్తేదారులు చేతులెత్తేయడంతో అధికారులు గ్రామస్థుల చేత పనులు చేయించారు. నాపరాళ్లతో తాత్కాలిక ఘాట్లు ఏర్పాటు చేశారు. కుసుమర్తి, సుకూరు, లింగంపల్లి గ్రామాల వద్ద స్నాన ఘాట్లు సిద్ధం చేశారు. కుసుమర్తి వీఐపీ ఘాట్‌ వద్ద నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ కేవలం జల్లు స్నానాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. స్నానాలు చేసేచోట గురువారం సాయంత్రానికి ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. 2006లో జరిగిన పుష్కరాల్లో జిల్లా పరిధిలో దాదాపు యాభై వేలమంది పుష్కర స్నానాలు చేశారు. ఈ సారి నదిలో నీళ్లు పెద్దగా లేవు. అధికారులు చేస్తున్న ప్రచారం కూడా తక్కువగానే ఉంది.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు