close

28 లక్షల మంది మహిళలకు ఓటు నిరాకరణ

 

స్వతంత్ర భారతదేశంలో 1952లో తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి కత్తి మీద సాములా మారింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడానికి ఇష్టపడేవారు కాదట. వారి పేర్లకు బదులుగా తండ్రి, భర్త పేర్లు ఇచ్చారట. ఇలా సుమారు 28 లక్షల మంది మహిళలు తమ పేర్లు ఇవ్వకపోవడంతో నాటి ఎన్నికల సంఘం కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ వాళ్లకు ఓటును నిరాకరించారు. ఆ క్రమంలోనే మొదటి సాధారణ ఎన్నికల్లో 45 శాతం పోలింగే నమోదైంది.

- ఈనాడు, వరంగల్‌

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు