close

ఎంజే అక్బర్‌ను పదవి నుంచి తప్పించాలి 

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: పాత్రికేయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కిన కేంద్ర సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత మజ్లిస్‌ పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ముమ్మారు తలాక్‌ విషయంలో లోక్‌సభలో సుదీర్ఘ ఉపన్యాసం చేసిన సదరు పెద్ద మనిషి ప్రముఖ మహిళా జర్నలిస్టు పట్ల అనుసరించిన అసభ్యకర ప్రవర్తనను యావత్‌ సమాజం తీవ్రస్థాయిలో ఖండిస్తోందన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. దీనిని జాతీయ మహిళా కమిషన్‌ సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేయించాలని కోరారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు