close

‘మహా’ ప్రణాళికలో చేనేత సమస్యలు 

భూదాన్‌పోచంపల్లి సభలో మహాకూటమి నేతలు 

భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, న్యూస్‌టుడే: నిరంకుశ విధానాలు అనుసరిస్తున్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు గోరీ కట్టే సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమింపజేశారు. అనంతరం అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ ప్రసంగించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ చేనేత కార్మికుల సమస్యలపై ఆకర్షణీయంగా మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. చేనేతకు కేటాయించిన రూ.1200 కోట్లలో  రూ.10 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు.  చేనేతల డిమాండ్లను మహాకూటమి అజెండాలో చేర్చుతామని, అధికారంలోకి రాగానే అమలుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. తొలి ఏడాదిలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, 6 లక్షల మహిళా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి, చేనేతలకు, రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలు తీర్చలేని కేసీఆర్‌కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు