close

తాజా వార్తలు

కర్తార్‌పూర్‌ను రాజకీయం చేస్తున్నారు:ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: కర్తార్ పూర్ నడవా ప్రారంభోత్సవ అంశాన్ని భారత్ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుందని, ఇది చాలా దురదృష్టకరమని గురువారం పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్ గురుద్వారాకు వచ్చే భారత యాత్రికుల కోసం నవంబరులో పాక్‌ కర్తార్‌ పూర్‌ నడవాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ గురుద్వారాలోనే సిక్కుల మత గురువు గురునానక్ తన చివరి రోజులు గడిపారు.

‘దాన్ని భారత్ రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరం. నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ హజరైనపుడు దీని గురించి చర్చించుకున్నాం’ అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ‘కర్తార్‌పూర్‌ కార్యక్రమానికి భారత్ రాజకీయ రంగు అద్దాలనుకుంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నడవాను ప్రారంభించామన్నది అబద్ధం. అది మా పార్టీ అజెండాలో భాగం’ అని ఖాన్ తెలిపారు. నవంబరు 28న జరిగిన కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌, హర్దీప్‌ పూరీ, పంజాబ్‌మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు