close

తాజా వార్తలు

ఒక్క రోజు ప్రదర్శనతో సిరీస్‌ గెలవలేం

మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్‌ స్టార్క్‌

అడిలైడ్‌: అడిలైడ్‌ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు భారత జట్టుపై ఆసీస్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఒక దశలో 86/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా... పుజారా పోరాడటంతో చివరకు 250/9తో నిలిచింది. ఒక్క రోజు బాగా ఆడినంత మాత్రాన ఎవరూ సిరీస్‌ గెలవలేరని మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ పేసర్‌ స్టార్క్‌ అన్నాడు.

‘మ్యాచ్‌లో మొదటి నాలుగు గంటల పాటు మేం చాలా బాగా బౌలింగ్ చేశాం. అయితే చివర్లో కొన్ని తప్పులు చేశాం. పుజారా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. ఒకరకంగా టాస్‌ ఓడిపోయి, తొమ్మిది వికెట్లు పడగొట్టి 250 పరుగులకు టీమిండియాను కట్టడి చేయడం గొప్ప విషయమే. మేం గత వారం రోజుల్లో బాగా సన్నద్ధమయ్యాం. ఇరు జట్లు బ్యాటింగ్ చేసే దాకా వికెట్‌ ఎలా ఉందో చెప్పలేం.’ అని స్టార్క్‌ పేర్కొన్నాడు.

కొత్త బంతితో భారత టాప్‌ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టడంలో ఆసీస్‌ బౌలర్లు సఫలమయ్యారు. స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌లతో కూడిన ఆసీస్‌ పేస్‌ ఆటాక్‌ 11 ఓవర్లలోపే రాహుల్‌, విజయ్‌, కోహ్లీ వికెట్లను పడగొట్టింది.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు