close

తాజా వార్తలు

సుప్రీంను ఆశ్రయించిన మాల్యా

ఆ ట్యాగ్ ను తొలగించుకోవడానికే

దిల్లీ: తన పేరుకు ముందు ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు ’ అనే ట్యాగ్‌ను తొలగించుకోవడానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘తాను పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాడు’ను కాదంటూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ) కోర్టుకు సెప్టెంబరులోనే మాల్యా వివరణ ఇచ్చారు. భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన నూరుశాతం ప్రజాధనాన్ని తిరిగి చెల్తిస్తానంటూ మాల్యా బుధవారం పలు ట్వీట్లలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డబ్బును తీసుకోవాలంటూ బ్యాంకులు, ప్రభుత్వాన్ని కోరారు. వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్న ఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు ఈ నెల పదో తేదీన తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

జూన్‌ 22న ఈడీ.. పీఎమ్‌ఎల్‌ఏ కోర్టుకు చేసిన దరఖాస్తులో అతడిని పలాయనంలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అలాగే రూ.12,500 కోట్ల విలువైన అతడి ఆస్తులను జప్తు చేసేందుకు ఆదేశాలివ్వాలని అందులో కోరింది. ఈ కొత్త చట్టం కింద నమోదు చేసిన మొదటి కేసు ఇది. సుప్రీం మాల్యా కేసును శుక్రవారం విచారణ జరపనుందని తెలుస్తోంది. రూ.9,000 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసి మాల్యా 2016 , మార్చి 2న దేశం విడిచి పారిపోయారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు