close

తాజా వార్తలు

బెలూన్‌తో ఫుట్‌బాల్‌ అడుకున్న సునీల్‌ ఛెత్రి

వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్ ఫుట్‌బాల్‌ టీమ్ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఈనెల 4న తన తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు సోనమ్‌ భట్టాచెర్జీని అతడు 2017 డిసెంబర్‌ 4న పెళ్లాడాడు. తన తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఛెత్రి ఘనంగా జరుపుకొన్నాడు. హృదయాకారంలో ఉన్న ఎరుపు రంగు బెలూన్‌ను ఛెత్రి-సోనమ్‌ ఇద్దరూ ఫుట్‌బాల్‌ మాదిరిగా తలతో ఆడుతున్న వీడియోను ఛెత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్‌ చేసిన రెండు గంటల్లో 1.20లక్షల మంది వీక్షించారు. దీనికి వేలల్లో లైకులొచ్చాయి.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు