close

తాజా వార్తలు

కుమార్తె చదువు కోసం..పనిమనిషిని చంపాడు 

చండీగఢ్‌: కుమార్తెను చదివించడానికి అవసరమైన డబ్బుల కోసం పనిమనిషిని చంపాడు ఓ వ్యక్తి. సినిమాను తలపించేలా పోలీసుల దగ్గర కథ అల్లారు కుటుంబ సభ్యులు. కానీ విచారణలో విషయం వెలుగులోకి రావడంతో చివరికి జైలు పాలయ్యారు. నవంబరు 19న పంజాబ్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఆకాశ్ అనే వ్యక్తి తన కుమార్తెను విదేశాల్లో చదివించాలనుకున్నాడు. కానీ అది నెరవేరాలంటే రూ.50లక్షలు కావాలని, తాను చనిపోతే ఇన్సూరెన్స్‌ ద్వారా ఆ డబ్బు వస్తుందని గ్రహించాడు. తాను చనిపోకుండా ఆ స్థానంలో ఎవరినైనా బలిపశువును చేయాలని తన బంధువు రవితో కలిసి పథకం పన్నాడు. ఇంట్లో పనిచేసే రాజు అనే వ్యక్తికి బాగా మందుపోసి, స్పృహ కోల్పోయేలా చేశారు. అతడిని ఓ కారులో కూర్చోబెట్టి, దానికి నిప్పంటించారు. తరవాత ఆకాశ్ చనిపోయాడని అతడి భార్య, కూతురు పోలీసులకు వెల్లడించారు. అయితే రవి ఇన్సూరెన్స్‌ డబ్బు కోసం అధికారులను ఒత్తిడి చేయడంతో వారికి అనుమానం వచ్చింది. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టడంతో జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. రాజు కనిపించడం లేదని అతడి కుటుంబ సభ్యులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయింది ఆకాశ్ అని అందరు భావించడానికి కారుకు నిప్పంటించే ముందు అతడి బ్రాస్‌లెట్‌ కూడా పెట్టారని పోలీసులు వెల్లడించారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు