close

తాజా వార్తలు

నీరవ్‌ మోదీ బంగ్లా కూల్చివేత

ముంబయి: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన బంగ్లాను కూల్చివేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బొంబే హైకోర్టుకు తెలియజేసింది. అలీబాగ్‌ ప్రాంతంలో పలువురు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా భవనాలు నిర్మించారని వాటిని వెంటనే తొలగించాల్సిందిగా కోరుతూ సామాజిక కార్యకర్త సురేంద్ర థవాలే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిందిన న్యాయస్థానం ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను వారంలోగా కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ నీరవ్‌ అక్రమంగా నిర్మించిన బంగ్లాతో పాటు దాదాపు 58 కట్టడాలను కూల్చివేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.

వర్సోలి, సస్వానే, కోల్గాన్‌, దోక్వాడేతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు 175 అక్రమ కట్టడాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిలో సంపన్నులు, వ్యాపారవేత్తలు, సినీనటులకి చెందిన భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులోనే నీరవ్‌ బంగ్లా కూడా ఉంది. పీఎన్‌బీ కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్‌ విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అతడిని భారత్‌ తిరిగి రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే భారత్‌ వస్తే తనను కొట్టి చంపేస్తారని అందుకే అక్కడికి రావడం లేదంటూ ఇటీవల నీరవ్‌ అధికారులకు తెలియజేశాడు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు