close

తాజా వార్తలు

‘సబ్‌కా సాత్’ మంత్రం ఆయన స్ఫూర్తితోనే: ప్రధాని

దిల్లీ: తమ ప్రభుత్వ నినాదం ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌’ కి స్ఫూర్తి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. జాతి నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలకు దేశం మొత్తం రుణపడి ఉందన్నారు. అంబేడ్కర్‌ 62వ వర్థంతి సందర్భంగా ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

‘‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌’ నినాదానికి ఆ నాయకుడే స్ఫూర్తి’ అని ఆయన పేర్కొన్నారు. చట్టం ముందు అందరు సమానులే, అవకాశాల్లో సమానత్వం, హక్కుల్లో సమానత్వం వంటి అంశాలను మనకు అందించారని ప్రశంసించారు. తమ ప్రభుత్వం బాబాసాహెబ్‌ ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటుందన్నారు. ‘జాతి నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలకు దేశం మొత్తం రుణపడి ఉంది’ అని అన్నారు. పార్లమెంటు భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మోదీ ... తదితరులు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు