close

తాజా వార్తలు

3,223 కేజీల బంగారం స్వాధీనం..!

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3,223 కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది కంటే ఇది 103శాతం ఎక్కువ. డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 2017-18లో కస్టమ్స్‌ అధికారులు రూ.974కోట్ల విలువైన 3,223కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది కంటే ఇది 103శాతం ఎక్కువ. 2016-17లో రూ.472కోట్ల విలువైన 1,422కేజీల బంగారాన్ని పట్టుకున్నాం’ అని డీఆర్‌ఐ వెల్లడించింది.

కోల్‌కతా, ముంబయి, చెన్నై, దిల్లీ నగరాల్లోనే ఎక్కువగా అక్రమ తరలిస్తున్న బంగారం లభ్యమైనట్లు డీఆర్‌ఐ వెల్లడించింది. ఇక అక్రమంగా తరలిస్తున్న రూ.89కోట్ల విదేశీ కరెన్సీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో ఈ అక్రమ విదేశీ కరెన్సీ లభించింది. అలాగే 26,785కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. రూ.70.06లక్షల నకిలీ కరెన్సీని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు