close

తాజా వార్తలు

వేరబుల్స్‌ విభాగంలో షామీ అగ్రస్థానం

వెల్లడించిన ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌

దిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ దేశీయ మార్కెట్‌లో ధరించే పరికరాల(వేరబుల్స్‌) అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. షామీ దేశీయ విపణిలోకి ఎంఐ బ్యాండ్‌ 3 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టింది. వేరబుల్స్‌ విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో అమ్మకాలు జరగడంతో షామీ ఈ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మూడో త్రైమాసికం ముగిసే సరికి 41 శాతం వాటాతో షామీ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌(ఐడీసీ) గురువారం వెల్లడించింది. మరో సంస్థ గోకీ ఇదే విభాగంలో 19 శాతం మార్కెట్‌ వాటాతో రెండో స్థానంలో ఉంది. టైటాన్‌, సాంసంగ్‌, ఫాసిల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో వేరబుల్స్‌ మార్కెట్‌ అమ్మకాలు 11 శాతం మేర తగ్గడం గమనార్హం.

ఈ ఏడాది వేరబుల్స్‌ విభాగంలో మొత్తంగా 8,97,000 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. మూడో త్రైమాసికంలో 1,02,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దేశీయ మార్కెట్‌లో వేరబుల్స్‌ రంగం 17 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఐడీసీ నివేదికలో వెల్లడించింది. 2017తో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 20 శాతం మేర షిప్‌మెంట్స్‌ తగ్గినప్పటికీ మొత్తంగా 77 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. ఇప్పటివరకు భారత్‌లో వేరబుల్స్‌ విభాగంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధిక అమ్మకాలతో ఎంఐ బ్యాండ్‌ 3 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ చరిత్ర సృష్టించింది.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు