close

తాజా వార్తలు

నా ఇంట్లో డబ్బు దొరికితే చూపించండి: జూపూడి 


హైదరాబాద్‌: తన ఇంటివద్ద నగదు దొరికిందనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పందించారు. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని తన నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేశారని, అయితే ఎలాంటి నగదు లేదని వెళ్లిపోయారని ఆయన వెల్లడించారు. కానీ ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. తాము ఎక్కడ బతకాలో కూడా తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బంధువులను కూడా తమ ఇంట్లోకి రానీయడంలేదని వాపోయారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలని, ఇంట్లో తన భార్య తప్ప ఎవరూ లేరని, ఇదంతా కావాలనే చేస్తున్నారని ఆరోపించారు. తెరాస ప్రభుత్వానికి ఇలా చేయడం సరికాదని జూపూడి అన్నారు.

ఈ వ్యవహారంలో దొంగలెవరో న్యాయస్థానంలోనే తేలుతుందని, డబ్బు పట్టుకునే హక్కు పోలీసులకు మాత్రమే ఉంటుందని తెదేపా సీనియర్‌ నేత పెద్దిరెడ్డి చెప్పారు. పౌరులకు సమాచారం ఇచ్చే హక్కు మాత్రమే ఉంటుందని, తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తారని ఆయన అన్నారు. పెద్దిరెడ్డిని రానీయకుండా తెరాస కార్యకర్తలు జూపూడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు