close

తాజా వార్తలు

కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

విజయవాడ: ఏపీలో ఆటోమొబైల్‌ రంగంలో కీలక అడుగు పడింది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయేతరం పర్యావరణ రవాణాపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం సచివాలయంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌, ఎలక్ట్రిక్‌ కార్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

సీఎం ప్రారంభించిన నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను కియా మోటార్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చింది. ఈ కార్లు ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది. త్వరలో విజయవాడలో వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను కియా మోటార్స్‌ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆ కంపెనీ అనంతపురంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు