close

తాజా వార్తలు

స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో వైరల్‌!

దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాస్యచతురత కలిగిన వ్యక్తి. అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేసే ఫన్నీ ఫొటోలే నిదర్శనం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్మృతి తన భర్త జుబిన్‌ ఇరానీతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఫొటోలో ఇద్దరూ మెట్లపై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించారు. స్మృతి ఫొటోపై ‘దేవుడా తీసుకుపో..నన్ను కాదు నా బరువును’ అని, ఆమె భర్త ఫొటోపై ‘ఈమెను కూడా తీసుకుపోతే మరీ మంచిది’ అని రాసున్న ఈ ఫొటోకు ‘భార్యలు చాలా అద్భుతమైన వ్యక్తులు అని చెప్పే భర్తల అసలు కథ ఇది.’ అని ఫన్నీగా క్యాప్షన్‌ ఇచ్చారు స్మృతి.

అయితే ఆమె ఎవర్ని ఉద్దేశిస్తూ ఈ ఫొటోను పోస్ట్‌ చేశారో మాత్రం చెప్పలేదు. ఈ ఫొటోను ఇప్పటివరకు 19వేల మంది లైక్‌ చేశారు. ‘మేడమ్‌..మీకు మంచి హాస్యచతురత ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో స్మృతిఇలాంటి ఎన్నో ఫన్నీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల రణ్‌వీర్‌, దీపిక పదుకొణెల వివాహం జరిగినప్పుడు వారి పెళ్లి ఫొటోలు ఎప్పుడొస్తాయా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు.

ఆ అభిమానుల బాధను వివరించేందుకు స్మృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అస్థిపంజరం బల్లపై కూర్చుని ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. గతంలో ఆమె శబరిమల విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలు కామెంట్లు చేశారు. వారికి సమాధానంగా స్మృతి ఇన్‌స్టాగ్రామ్‌లో తన కాళ్లు, చేతులు, నోరు కట్టేసి ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసి వారి నోరుమూయించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు