close

తాజా వార్తలు

మధుయాష్కీకి నిరసన సెగ: కార్లు ధ్వంసం 

జగిత్యాల: ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధుయాష్కీ కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లికి రావడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మెట్‌పల్లిలోని ఓ వైద్యుడి ఇంటికి వచ్చిన ఆయనను కాంగ్రెస్‌ అసంతృప్త కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములకు టికెట్‌ రాకుండా మధుయాష్కీ అడ్డుకున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మధుయాష్కీ ఉన్న చోటకు వెళ్లి రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న తెరాస కార్యకర్తలు డబ్బులు పంచడానికే మధుయాష్కీ అక్కడికి వచ్చారనే అనుమానంతో వారూ ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల నేతలు ఆందోళనలతో మధుయాష్కీ  ఇంటి వెనుకనుంచి వెళ్లిపోయారన్న సమాచారంతో మరింత ఆగ్రహావేశాలకు లోనై ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆయన ద్విచక్రవాహనంపై అక్కడినుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు