close

తాజా వార్తలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లేటెస్ట్‌ అప్‌డేట్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు రాజమౌళి ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకునే సమయం. మీరు కూడా ఓటు వేస్తున్నారా? తెలంగాణ ప్రజలారా రేపటి కోసం ఓటేయండి’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నేపథ్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. తర్వాతి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు, ఇందులో నటించే కథానాయికల వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో ముగ్గురు కథానాయికలుంటారని సమాచారం. అందులో ఓ కథానాయికగా విదేశీ భామని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురూ ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు. ఓ కీలక పాత్రకు ప్రియమణిని సంప్రదించారని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చిత్రమిదే. అంతేకాదు, ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు