close

తాజా వార్తలు

పుజారా మరో రికార్డు

టెస్టుల్లో 5,000 పరుగులు పూర్తి

అడిలైడ్‌: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ ఛతేశ్వర్‌ పుజారా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇది నిజంగా ఎవరూ ఊహించనిదే. ఆసీస్‌ టెస్టంటే ఇన్ని రోజులు ఓపెనర్లు, విరాట్‌ కోహ్లీ గురించే మాట్లాడుకున్నారు. అయితే ఎవరూ ఊహించనంతగా పుజారా తన శతకంతో ఆకట్టుకున్నాడు. ఓవైపు టీమిండియా ఆటగాళ్ల వికెట్లు కుప్పకూలిపోతుంటే ఏమాత్రం బెదరకుండా క్రీజులో నిలబడ్డాడు.బాధ్యయుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన పుజారా 16వ (123; 246బంతుల్లో 7×4, 2×6)శతకం పూర్తి చేసుకున్నాడు.

దీంతో తన టెస్టు కెరీర్‌లో పుజారా 5,000పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 108ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇందులో 16 శతకాలు,19 అర్ధశతకాలు ఉన్నాయి. వేగంగా ఐదువేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సునిల్‌ గావస్కర్‌(95 ఇన్నింగ్స్‌), వీరేందర్‌ సెహ్వాగ్‌(99), సచిన్‌ తెందుల్కర్‌ (103), విరాట్‌ కోహ్లీ (105)ఇన్నింగ్స్‌లలో ఐదువేల పరుగుల మైలురాయి చేరుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు