close

తాజా వార్తలు

హెల్మెట్ ధరించలేదని మంత్రికి కోర్టు నోటీసులు

చెన్నై: ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తూ హెల్మెట్ ధరించలేదని గురువారం మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయ్‌ భాస్కర్‌కు నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్‌ రామస్వామి అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన వ్యాజ్యం ఆధారంగా భాస్కర్‌, స్థానిక ఎమ్మెల్యేకు ఈ నోటీసులు పంపించింది. ఆంగ్ల ప్రతిక కథనం ప్రకారం..భాస్కర్‌, ఏఐఏడీఎంకే కార్యకర్తలు, వలంటీర్లు పుదుకొట్టైలో ఓ ఆందోళన కార్యక్రమం సందర్భంగా హెల్మెట్లు ధరించలేదని రామస్వామి కోర్టుకు వెల్లడించారు. ద్విచక్రవాహనం మీద వెళ్లే సమయంలో హెల్మెట్లు ధరించడం తప్పనిసరని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇది ఉల్లఘించడమే అవుతుందని అందులో వివరించారు. అదేవిధంగా సర్కార్ సినిమా విడుదల సమయంలో మదురై థియేటర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రాజన్‌ చెల్లప్ప చేపట్టిన ఆందోళన వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యారని, ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారని అందులో వెల్లడించారు. కె.ఆర్ రామస్వామిని ట్రాఫిక్‌ రామస్వామి అని కూడా అంటారు. ఆయన చెన్నైకు చెందిన సామాజిక కార్యకర్త.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు