close

తాజా వార్తలు

వీఆర్వో పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో వీఆర్వో ఉద్యోగ నియామక రాత పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించింది. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులను వెబ్‌సైట్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో ఉద్యోగాల కోసం సెప్టెంబర్‌ 16న నిర్వహించిన రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు అధికారులు 2,945 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 7,87,049 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన 7,38,885 మందికి మార్కులు, ర్యాంకులను కమిషన్‌ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగానికి ముగ్గురిని ఎంపిక చేసి జిల్లాల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు