close

తాజా వార్తలు

చరిత్ర సృష్టించిన పాక్‌ బౌలర్‌

32 టెస్టుల్లోనే 200వికెట్లు పడగొట్టాడు

అబుదాబి: పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ యాసిర్‌ షా చరిత్ర సృష్టించాడు. 82ఏళ్ల రికార్డును షా అధిగమించాడు. వేగంగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. షా 32టెస్టుల్లో 200 వికెట్లు తీశాడు.ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియన్‌ స్పిన్నర్‌ క్లారీ గ్రిమ్మెట్స్‌ మీద ఉంది. 1936లో జోహెసెన్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా-ఆసీస్‌ల మధ్య జరిగిన టెస్టుల్లో ఆయన ఈ రికార్డు సృష్టించాడు. కేవలం 36 టెస్టుల్లో 200 వికెట్లు తీసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు దాదాపు 82ఏళ్ల తర్వాత పాక్‌ బౌలర్‌ షా దాన్ని అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు నాలుగోరోజు ఆటలో షా వికెట్‌ తీయడంతో 200వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

షా 2014లో ‌ఆసీస్‌తో జరిగిన టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులోనే ఏడు వికెట్లు తీసి పాక్‌ ఫేవరెట్‌ బౌలర్‌గా మారాడు. రెండు టెస్టుల సిరీస్‌లో అతడు 12 వికెట్లు తీశాడు. అదే సంవత్సరంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల్లోనూ 15 వికెట్లు తీసి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2015లో శ్రీలకంతో జరిగిన టెస్టుల్లో 24వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో 21, వెస్టిండీస్‌ టెస్టుల్లో 25 వికెట్లు పడగొట్టాడు.

తొమ్మిది టెస్టుల్లో వేగంగా 50వికెట్లు తీసిన తొలి పాక్‌ బౌలర్‌ కూడా ఇతడే. 17 టెస్టుల్లో 100వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ ఆటగాడు జార్జ్‌ లోహమన్‌ మీద ఉంది. 1896లో ఇతడు 16 టెస్టుల్లోనే 100 వికెట్లు పడగొట్టాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు