close

తాజా వార్తలు

పాతబస్తీలో తుపాకీ కలకలం

హైదరాబాద్‌: పోలింగ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. హైదరాబాద్ పాతబస్తీ లో తుపాకీ కలకలం రేగింది. మావోయిస్టు సానుభూతిపరుడు ఓదెల శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద లోడ్ చేసి ఉన్న రివాల్వర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అశోక్ అనే వ్యక్తి వద్ద తన ఇంటిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి తీర్చకపోవడం తో అశోక్‌ కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆయన్ను హతమార్చాలని భావించిన శ్రీనివాస్.. ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లి రివాల్వర్‌ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇప్పటి వరకు 4,587 మంది వారి లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌లను డిపాజిట్ చేసారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు