close

తాజా వార్తలు

ఫోన్లు అనుమతించం.. సెల్ఫీలు నిషేధం: ఈసీ‌

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సర్వం సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ‘ఈటీవీ’తో మాట్లాడారు. దివ్యాంగులు ఓటు వేసేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల వరకు వారికి ఉచిత రవాణా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీల్‌ ఛైర్లు, రెయిలింగ్స్‌, ర్యాంప్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కొన్ని చోట్ల మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరని, 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకొని పోలింగ్‌ కేంద్రానికి రావాలని సూచించారు. ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు.

ఓటువేసే ప్రతి ఒక్కరూ గోప్యత పాటించాలని, రహస్య బ్యాలెట్‌ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాని కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అంతా హుందాగా ప్రవర్తించాలని, ధూమపానం చేయడంపై నిషేధం ఉందని చెప్పారు. మద్యం తాగి ఏ ఒక్కరూ ఓటింగ్‌కు వెళ్లకూడదని, అది హుందాతనం కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు. పోలింగ్‌ ప్రక్రియపై అనుక్షణం తాము పర్యవేక్షిస్తుంటామని, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు రజత్‌కుమార్‌ వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు