close

తాజా వార్తలు

ఇంటి కోసం పోరాడుతున్న మాల్యా

జప్తు కోసం ప్రయత్నిస్తున్న యూబీఎస్‌ బ్యాంకు

న్యూదిల్లీ: విజయ్‌మాల్యా ప్రస్తుతం నివసిస్తున్న లండన్‌ రీజెంట్ పార్క్‌లోని ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రూ.వందల కోట్లు విలువ చేసే ఈ విలాసవంతమైన ఇంటిని ఇప్పుడు యూబీఎస్‌ బ్యాంకు జప్తు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

మాల్యా కుటుంబ ట్రస్టుకు చెందిన రోస్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ గతంలో ఈ ఇంటిని తనఖా పెట్టి యూబీఎస్‌ బ్యాంకు నుంచి 26.6 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.19 వందల కోట్లు) రుణం తీసుకుంది. ఇది తిరిగి చెల్లించకపోవడంతో యూబీఎస్‌ బ్యాంకు ఇప్పుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని కోరుతూ కోర్టు మెట్లెక్కింది. ప్రస్తుతం విజయ్‌ మాల్యా కుటుంబంతో సహా నివసిస్తున్న ఈ ఇంటిని ఆయన ఇంకా ఘనంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బ్యాంకు తరపు న్యాయవాది థామస్‌ గ్రాంట్‌ కోర్టుకు చెప్పారు. ‘‘బ్యాంకుకు గడువులోపు చెల్లిస్తామన్న రుణాన్ని తిరిగి చెల్లించలేదు. అందుకే మేం మాల్యా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలి’’ అని ఆయన లండన్‌ కోర్టును కోరారు.

ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే గడువుకంటే ముందే యూబీఎస్‌ బ్యాంకు జప్తు కోరుతోందని రోస్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. రుణం చెల్లింపునకు చట్టబద్ధమైన నిరీక్షణ కోరామని చెప్పారు. దీనిపై కౌంటర్‌ ఇచ్చిన యూబీఎస్‌ బ్యాంకు.. కింగ్‌ ఫిషర్‌ కోసం తీసుకున్న రుణాలు మాల్యా ఉద్దేశ పూర్వకంగానే ఎగవేశారని మీడియాలో వస్తున్న వార్తల వల్ల మాల్యాతో, అతని అనుబంధ సంస్థలతో సంబంధాలు తెంచుకునే ఉద్దేశంతోనే ముందస్తు జప్తు కోరుతున్నట్లు పేర్కొంది. ఈ రుణం గడువు గతేడాది మార్చితో పూర్తయిందని వెల్లడించింది.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ కోసం అప్పట్లో మాల్యా భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. వీటిని తిరిగి చెల్లించనందుకు గానూ ప్రస్తుతం భారత్‌, యూకేలోని న్యాయస్థానాల్లో ఆయనపై ఆర్థిక పరమైన కేసులు విచారణలో ఉన్నాయి.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు