close

తాజా వార్తలు

నేరం రుజువైతే నా కొడుకుని ఉరి తీయండి!

గుజరాత్‌ ఘటన నిందితుడి తల్లి

 

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో స్థానికేతరులపై దాడులు స్థానికంగా సంచలనం సృష్టిస్తున్నాయి. గతనెల 28న సాబర్‌కాంఠా జిల్లాలో 14 నెలల పసికందుపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఒక్కసారిగా గుజరాతీయేతరులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలయ్యాయి. బిహార్‌కు చెందిన వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ మర్నాడే పలు జిల్లాల్లో హింస చెలరేగింది. ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. అయితే ఒక్కరి కారణంగా గుజరాతీయేతర వ్యక్తులపై జరుగుతున్న దాడులపై నిందితుడి తల్లి రమావతి దేవి స్పందించారు. తప్పు చేశాడని రుజువైతే తన కొడుకుని ఉరితీయమని ఆమె గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ...‘ తప్పు చేశాడని రుజవైతే అతడిని శిక్షించండి. ఉరితీయండి. అంతేగానీ నా కొడుకు వల్ల మిగతా బిహారీలను శిక్షించకండి. వారిపై దాడి చేయడాన్ని ఆపేయండి’ అని ప్రభుత్వాన్ని కోరారు.

నిందితుడి తండ్రి మాట్లాడుతూ...‘ నాకొడుకు మైనర్‌, అతడి మానసిక పరిస్థితి సరిగా లేదు. అతడు ఐదో తరగతి వరకే చదువుకున్నాడు. నాకున్న నలుగురు సంతానంలో వాడు మూడోవాడు. రెండు సంవత్సరాల క్రితం ఎవ్వరికీ చెప్పకుండా తన స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతడు గుజరాత్‌లో ఉన్నాడని మాకు కొన్ని నెలల ముందే తెలిసింది’ అని తెలిపారు.

స్థానికేతరులపై జరుగుతున్న దాడులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ స్పందించారు. వలసపోతున్న స్థానికేతరులను తిరిగి రాష్ట్రానికి వచ్చేయాల్సిందిగా ఆయన కోరారు. దీంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసవచ్చిన వందలాది కార్మికులు ఈ దాడుల నేపథ్యంలో ఉత్తర గుజరాత్‌ ప్రాంతాన్ని వదిలి వెళ్లడం మొదలైంది. ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర రిజర్వు పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు