close

తాజా వార్తలు

మరి నీ కూతురికి ఏం చెప్తావ్‌?: సమంత

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో తుపానులా మారుతున్న ‘మీటూ’ ఉద్యమానికి ఎందరో నటీనటులు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చిన్నవయసులో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయం గురించి కథానాయిక సమంత మాట్లాడుతూ.. తాను చిన్మయి చెప్పేది నమ్ముతానని, ఆమెకు పూర్తి మద్దతునిస్తానని ట్వీట్‌ చేశారు. నటీమణులతో పాటు కొందరు నెటిజన్లు కూడా ‘మీటూ’పై స్పందిస్తున్నారు.

సమంత వారందరికీ మద్దతు తెలుపుతుండడంతో ఇద్దరు నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా..సినీ నటుడు నానా పటేకర్‌ కారణంగా పదేళ్ల క్రితం లైంగిక వేధింపులు ఎదుర్కొంటే ఆ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. దీనిపై కార్తికేయన్‌ అనే నెటిజన్‌ సమంతకు ట్వీట్‌ చేశాడు. ‘పదేళ్ల తర్వాత ఇప్పుడు చెబితే మేం ఒప్పుకోం. అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించాడు. ఇందుకు సమంత తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

‘మా భయం కూడా అదే.. మీరెక్కడ తప్పంతా మాదే అంటారోనన్న భయంతో సమయం కుదిరినప్పుడల్లా సమస్యలను బయటపెడుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు. గౌరవ్‌ ప్రధాన్‌ అనే మరో నెటిజన్‌ కూడా సమంతకు ట్వీట్‌ చేశాడు. ‘ఈరోజు మా అబ్బాయి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ‘డాడీ అసలు ఈ ‘మీటూ’ అంటే ఏంటి?’ అని అడిగాడు. అప్పుడు నేను ‘మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్‌ బీమా పథకం’ అని చెప్పాను. అప్పుడు మా అబ్బాయి ‘అదెలా?’ అని ప్రశ్నించాడు. ‘ఆడవారు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్‌ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకర్లు వార్తలిస్తుంటారు.’ అని చెప్పాను. ఇది విని మా అబ్బాయి ‘గాడ్‌ బ్లెస్‌ ఇండియా’ అన్నాడు’ అని గౌరవ్‌ పేర్కొన్నాడు. ఇందుకు సమంత కాస్త ఘాటుగానే ప్రతిస్పందిస్తూ..‘ఇదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెప్తావ్‌?’ అని ప్రశ్నించారు.


Tags :

తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు