close

తాజా వార్తలు

వారిని రక్షించకపోతే కష్టమే

ముంబయి: ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు ఎక్కడా ఆడవారు లైంగిక వేధింపులను ఎదుర్కోకూడదని అంటున్నారు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఈరోజు బచ్చన్‌ తన 76వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. తన పుట్టినరోజు విశేషాలు, ‘మీటూ’ ఉద్యమం, తన తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మీకు పుట్టినరోజులంటే ఎందుకు ఇష్టంలేదు?

అమితాబ్: అనవసరమైన హడావుడి ఉంటుంది. బర్త్‌డే అంటే ఒక మనిషి జీవితంలో వచ్చే ఒక రోజు మాత్రమే. అందులో పెద్ద విషయం ఏముంది?

మీ అభిప్రాయంలో అసలు బర్త్‌డే అంటే ఎలా జరగాలి?

పాపులారిటీకి, అటెన్షన్‌కి దూరంగా ఉండాలి. కానీ నాకు నా కుటుంబీకులతో కలిసి ఎంజాయ్‌ చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా మనవళ్లు ఉండాలి.

ఈ మధ్యకాలంలో ‘మీటూ’ ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతోంది? ఈ విషయం గురించి మీరేమంటారు?

ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆమె పనిచేసే వాతావరణంలో. అలాంటివి ఎదురైనప్పుడు సదరు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మన సమాజంలో మహిళలు, పిల్లల పట్ల ఇప్పటికీ బలహీనులనే అన్న ముద్ర ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి. మన దేశంలో పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది మనసును కలచివేస్తోంది. వారికి దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వకపోతే మన దేశంపై చెరిపేసుకోలేని మచ్చ పడుతుంది.

ఎన్నో ఏళ్ల పాటు మీరు ఇతరుల కోసం జీవితాన్ని అంకితం చేశారు. ‘ఇక చాలు. ఇక నా కోసం నేను జీవించాలి’ అని ఎప్పుడైనా అనిపించిందా?

అలా ఎందుకు అనిపిస్తుంది? ఇతరుల కోసం జీవించే మనుషులు మీకు ఎక్కడా కనిపించరు. ‘ఇక చాలు’ అని ఓ ఆర్టిస్ట్‌గా నేను అనుకుంటే నా స్థానం బలహీనమైపోతుంది. ఇప్పటివరకు నేను సాధించినదంతా వృథా అయిపోతుంది.

మీ జీవితంలో తీరని కలలు ఏమన్నా ఉన్నాయా?

ఓ నటుడిగా చెప్పాలంటే లక్షలాది కలలు తీరకుండా మిగిలిపోయాయి. నా హద్దులు తెలుసుకుంటూ రోజూ నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకోవడం ఛాలెంజ్‌తో కూడుకున్నదే. ఓ మ్యుజిషియన్‌గా చెప్పాలంటే.. కొత్త వాయిద్య పరికరాలను వాయించడం నేర్చుకోవాలని ఉంది. సంగీతం అంటే నాకు దేవుడితో సమానం.

మీరు ప్రధాన పాత్రలో నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ మేకప్‌ వేసుకుని యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడం ఎలా అనిపించింది?

నిజమే..మేకప్‌, యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైన పని. కానీ ఏ ఉద్యోగం సులువుగా ఉంటుంది చెప్పండి? సినిమాలో నా పాత్ర కోసం మేకప్‌ వేయడానికి నాలుగు గంటలు పట్టేది. తీసేయడానికి మరో గంటన్నర పట్టేది. కానీ ఒక సినిమాను నిబద్ధతతో చేయాలి..అని నిర్ణయించుకున్నప్పుడు దర్శకుడు చెప్పిన విధంగా నడుచుకోవాలి. నేను అలాగే చేశానని అనుకుంటున్నాను.

మీరు నటించిన ‘దీవార్‌’ సినిమాను ఇప్పుడు రీమేక్‌ చేస్తే మీ పాత్రలో, శశి కపూర్‌ పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది?

ఇండస్ట్రీలో మా కంటే బాగా నటించేవారు చాలా మంది ఉన్నారు. కానీ నా అభిప్రాయం చెప్పాలంటే..అంత మంచి సినిమాను, స్క్రిప్ట్‌ను ముట్టుకోకుండా ఉంటేనే మంచిది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు