close

తాజా వార్తలు

నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా: పాండ్య

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ప్రేమలో పడ్డాడట. అమ్మాయితో కాదు తాను పెంచుకుంటున్న కుక్కపిల్లతో. ఈరోజు పాండ్య తన 25వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ ప్రత్యేకమైన రోజున పాండ్య తన ఇంట్లోకి మరొకరిని ఆహ్వానించారు. దాని పేరు బెంట్లీ. అది పాండ్య కొనుక్కున్న కుక్కపిల్ల పేరు. ఈ విషయాన్ని పాండ్య ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘ఇది నా కొత్త బెంట్లీ. చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రేమగా ఉంటుంది. మా కుటుంబంలోకి స్వాగతం బెంట్లీ పాండ్య. ఇక మన ఇద్దరి పుట్టినరోజులు కూడా ఒకేరోజు వచ్చాయి’ అని పాండ్య సరదాగా ట్వీట్‌ చేశారు.

అంతేకాదు కుక్క నిద్రపోతున్నప్పుడు తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేస్తూ.. ‘మై లవ్‌..తొలిసారి నా జీవితంలో నాకంటే ఎక్కువగా ఒకరిని ఎంతో ప్రేమిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పాండ్య ఫన్నీ ట్వీట్స్‌ చూసి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘కుక్కతో ఆడుకుంటూ టైంపాస్‌ చేయకు..ఆటపై కూడా దృష్టిపెట్టు’ అని ఛలోక్తులు విసురుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు