close

తాజా వార్తలు

కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు‌

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో నేడు దలాల్‌ స్ట్రీట్‌ కుప్పకూలింది. దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం అలాగే నష్టాలను కొనసాగించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాటపట్టడం సూచీలను మరింత దెబ్బ తీసింది. రూపాయి మారకం విలువ నేడు ఓ దశలో రూ.74.45కు చేరి జీవన కాల కనిష్ఠానికి చేరింది. తర్వాత కాస్త బలపడినప్పటికీ మార్కెట్లపై ప్రభావం చూపలేకపోయింది.

ఉదయం సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువన ట్రేడింగ్‌ను ఆరంభించింది. సెన్సెక్స్‌ తర్వాత కాస్త కోలుకుని మధ్యాహ్నం సమయంలో 450 పాయింట్ల నష్టానికి చేరుకుంది. కానీ, మళ్లీ పతనమవుతూ వచ్చి చివరకు సెన్సెక్స్‌ 759.74 పాయింట్లు నష్టపోయి 34,001.15కు చేరింది. నిఫ్టీ 225.45 పాయింట్లు నష్టపోయి 10,234.65 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.11 వద్ద కొనసాగుతోంది.

నేడు ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంకు తదితర కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌సర్వీసెస్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంత తదితర కంపెనీలు భారీగా నష్టపోయాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు