close

పెరిగిపోతున్న ఫిరాయింపుల జాడ్యం

 చర్యల్లో జాప్యం ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం చేయడమే 
  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

ఈనాడు, అమరావతి: దేశంలో ప్రస్తుతం పార్టీలు మారే జాడ్యం రోజురోజుకూ పెరిగిపోతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడంలో తప్పుకాదని, అయితే పార్టీ ద్వారా వచ్చిన పదవిని వీడాకే మరో పార్టీలోకి వెళ్లడం అనేది కనీస ధర్మమని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. లేకుంటే పార్టీ ఫిరాయింపుల కింద వాళ్లని అనర్హులను చేయాలన్నారు. కానీ ఆ పని సక్రమంగా జరగడం లేదని.. స్పీకర్లు, ఛైర్మన్ల వద్ద ఏళ్ల తరబడి అవి పెండింగ్‌లో ఉండిపోతున్నాయన్నారు. ఇలా జాప్యం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అవసరమైతే కఠిన చట్టాలను తేవాలని, ఫిరాయింపులు, ఎన్నికల వ్యాజ్యాలపై ఏడాదిలోనే చర్యలు చేపట్టాలన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై 4,127 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తాజాగా సుప్రీంకోర్టు వెల్లడించిందని, వీటిపై సత్వరం తీర్పు వెలువరించే విధానం రావాలన్నారు. ఆర్థిక నేరస్థులను స్వదేశానికి అప్పగించే విషయంలోనూ చట్టాల్లో మార్పులు తేవాలన్నారు. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వస్తున్న ఆదాయానికి.. ఈ హామీలు అమలు సాధ్యమవుతాయో లేదో చూసుకోవాలన్నారు. బాధ్యతారహితమైన, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తే.. వాటిపై నిలదీసే హక్కు ప్రజలకు ఉన్నప్పుడే.. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రజలు ఆలోచించి ఓటేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు, ప్రాథమిక చికిత్సపై నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొని మాట్లాడారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు