close

శుక్రవారం, డిసెంబర్ 14, 2018

తాజా వార్తలు

డాక్టర్‌ సినారె, డాక్టర్‌ దాశరథి సినీ సాహిత్య సంగమం

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, డాక్టర్‌ దాశరథి సినీ సాహిత్య అనుబంధంతో వైవిధ్య సంగీత విభావరికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ శరత్‌చంద్ర సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్‌ శ్రీకారం చుట్టింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు, అంతర్జాతీయ గాయకుడు డాక్టర్‌ శరత్‌ చంద్ర కార్యక్రమ వివరాలను విలేకర్లతో వెల్లడించారు. కరీంనగర్‌ కళాభారతిలో మార్చి 13, 14, 15 తేదిల్లో సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్‌ సినారె, డాక్టర్‌ దాశరథి సినీ సాహిత్య సంగమం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ‘పాటకు ముందు పద్యం.. తెలంగాణ తల్లికి నైవేద్యం’ పేరుతో ఈ కార్యక్రమం సాగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఔత్సాహిక గాయనీ గాయకులు తమ పాట, పేరు తదితర వివరాలను నిర్వాహకులకు ముందుగా తెలియజేయాలని కోరారు. ఎంచుకున్న పాట.. అందుకనుగుణంగా ఒక పద్యం చదివే ఈ వైవిధ్య కార్యక్రమంలో కొత్తదనాన్ని ఆస్వాదించాలని కోరారు. 16న ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని.. ఆ రోజు ఉమ్మడి జిల్లాలో పద్యం మీద మంచి పట్టున్న 9 మంది కవులకు డాక్టర్‌ సినారె, డాక్టర్‌ దాశరథి పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ప్రవేశం ఉచితం, ఎలాంటి రుసుం వసూలు చేయమని తెలిపారు. ఔత్సాహిక గాయనీగాయకులు మరిన్ని వివరాలకు 9177805881, 7989323621 చరవాణి నంబర్లలో సంప్రదించి పాడే పాట, పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. సీనియర్‌ గాయకులు టి.మోహన్‌స్వామి, వంగ వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.