close

శనివారం, డిసెంబర్ 15, 2018

తాజా వార్తలు

యాదాద్రి రథోత్సవ వేడుకల్లో జిల్లా నర్తకీమణులు 

ఆదిలాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి బ్రహోత్మవాల సందర్భంగా ఆదివారం రాత్రి జరిగిన రథోత్సవం వేడుకల్లో జిల్లా నర్తకీమణులు సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు. భక్తులను అహ్లాదపర్చేలా తమ హావభావాలతో నృత్యభంగిమలతో ఆకట్టుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన నృత్యమాల నాట్య అకాడమీ నిర్వాహకురాలు డా.ఎం.ఏకవీర తమ శిష్యబృందం కూచిపూడి, భరతనాట్యం చేసి అలరించారు. బ్రహ్మోత్సవం.. బ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకా భక్తిగీతంపై నృత్యాలు చేశారు. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీనర్సింహాస్వామి వేషధారణలో నర్తకీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నృత్యంలో బచ్చువార్‌ సాయిలీ, శ్రేష్ఠ, సిరిచందన, వర్ణ, నవ్య, నిహారిక, ఆద్విక, శ్రీనిజ, స్నేహ, శీరిష, శ్రీదుర్గ, యశిక, వేదాజ్ఞ, ఆద్య, సహస్ర, ఆకృతి, చందన, లక్ష పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.