close

శనివారం, డిసెంబర్ 15, 2018

తాజా వార్తలు

అబాకస్‌ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ

మోత్కూరు, న్యూస్‌టుడే: విజయవాడలో విశ్వం ఎడ్యూటెక్‌ వారు జాతీయ స్థాయిలో ఆదివారం నిర్వహించిన అబాకస్‌ స్టార్‌ జూనియర్‌ పోటీలలో మోత్కూరుకు చెందిన శ్రీవిద్యానికేత్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థి కట్టెకోల సాయిసూరజ్‌ ప్రథమ స్థానంలో నిలిచారని ఆ పాఠశాల కరస్పాండెంట్‌ కె.మహేందర్‌ తెలిపారు. స్థానిక సెయింట్‌ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థి వట్టెపు జశ్వంత్‌ తృతీయ స్థానంలో నిలిచినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ పి.మరియన్న తెలిపారు. సోమవారం ఆయా పాఠశాలల్లో గెలుపొందిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పాధ్యాయులు అభినందించారు. ఈ ఇరువురు విద్యార్థులు చైనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు వివరించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.