close


చంద్రబాబు బయోపిక్‌.. ఫస్ట్‌లుక్‌ విడుదల

ఆ రోజే ‘చంద్రోదయం’!

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకట రమణ దర్శకుడు. జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ పీఆర్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. సినిమాకు ‘చంద్రోదయం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అక్టోబరు 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ ప్రచార చిత్రంలో చంద్రబాబును చూపించారు.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ 80 శాతం పూర్తయినట్లు దర్శకుడు చెప్పారు. ‘దేశచరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నాం. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు