close


ఆమెకు తెలుగు నేర్పిస్తున్నారట!

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఇందులో ప్రభాస్‌ తప్ప మిగతా నటీనటులంతా బాలీవుడ్‌ వారే కావడం విశేషం.

ఇందులో శ్రద్ధతో పాటు ఎవ్లిన్‌ శర్మ అనే మరో భామ కూడా నటిస్తున్నారు. అయితే ఎవ్లిన్‌కి జర్మన్‌, ఆంగ్లం తప్ప మరో భాష రాదు. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె పలికే హిందీ డైలాగులు కూడా ఆంగ్ల యాసతోనే ఉండేవి. ఇక తెలుగులో డైలాగులు అసలు అర్థమేకావడంలేదట. తెలుగులో తొలి అవకాశమే ప్రభాస్‌ సినిమా కావడంతో ఆమె భాష గురించి ఆలోచించకుండా సినిమాకు ఓకే చేసేశారు.

ఈ సినిమా కోసం ఆమె పది కిలోల తగ్గారు. ప్రస్తుతం ఎవ్లిన్‌పై దుబాయ్‌లో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేర్చుకోవడానికి ఆమె ఓ ట్యూటర్‌ను కూడా నియమించుకున్నారు. సెట్స్‌లో మాత్రం ఎవ్లిన్‌ డైలాగులు పలకడానికి ప్రభాస్‌ సాయపడుతున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ నటిస్తున్నారు. నీల్‌కు కూడా ప్రభాసే తెలుగు నేర్పించారట.

అబుదాబిలో భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రూ.90 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ భారీ ఛేజ్‌ సన్నివేశం కోసం 37 కార్లు, 5 భారీ ట్రక్కులను క్రాష్‌ చేశారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు