close


‘అ అ ఆ’ ఏం చేస్తున్నారు? 

రవితేజ మూడు పాత్రల్లో నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇలియానా కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. టాకీ పూర్తయింది. రెండు పాటలు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు  జరుగుతున్నాయి. రవితేజ డబ్బింగ్‌ చెబుతున్నారని, త్వరలోనే  మిగిలిన రెండు పాటల్నీ చిత్రీకరిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘‘రవితేజ, శ్రీనువైట్ల ఇద్దరూ వినోదాన్ని నమ్ముకున్నవాళ్లే. ఈ చిత్రంలోనూ వినోదం పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు ఇందులో ఓ కొత్త అంశం కనిపిస్తుంది. కథ, కథనాల్లో ఉత్కంఠ ఆకట్టుకుంటుంది. రవితేజ పాత్రలు మూడూ వేటికవే భిన్నంగా ఉంటాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్‌ విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: తమన్‌

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు