close


బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్లుంది

తెదేపా నేతలు రావుల, పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: ‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌ అద్భుతంగా వస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరావు, పెద్దిరెడ్డిలు అన్నారు. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రమిది. క్రిష్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం తెదేపా నేతలు రావుల, పెద్దిరెడ్డిలు ‘యన్‌టీఆర్‌’ చిత్రీకరణ జరుగుతున్న సెట్స్‌కు వెళ్లారు. కొద్దిసేపు బాలకృష్ణతో ముచ్చటించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌ చరిత్రలో నిలిచిపోతుంది. బాలకృష్ణ నటన చూస్తుంటే ఎన్టీఆరే స్వయంగా నటిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్టీఆర్‌ అండదండలతో ఈ ఎన్నికలో విజయభేరీ మోగిస్తాం. కేవలం షూటింగ్‌ చూడటానికి మాత్రమే ఇక్కడకు వచ్చాం. రాజకీయాలపై బాలకృష్ణతో చర్చించలేదు’’ అని అన్నారు.

‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌లు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణిగా విద్యాబాలన్‌, చంద్రబాబుగా దగ్గుబాటి రానా, అక్కినేనిగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘యన్‌టీఆర్‌’ను బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న కథానాయకుడు, జనవరి 24మహానాయకుడుగా విడుదల చేస్తారు.

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు