- TRENDING TOPICS
- Maharashtra Crisis
- Agnipath
- Presidential Election
- Ukraine Crisis
- Omicron
తాజా వార్తలు
వీడియోలు
-
TTD: ఘనంగా వేంకటేశ్వరుని కల్యాణోత్సవం..
-
Viral Video: డిజిటల్ అసిస్టెంట్‌పై వైకాపా నేత దాడి.!
-
Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
-
Janasena: కౌలు రైతుల కోసం పవన్ తల్లి అంజనాదేవి ఆర్థిక సాయం
-
Andhra news: అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Karnataka: కర్ణాటక రెండుగా విడిపోతుంది: మంత్రి ఉమేశ్ కత్తి
ఫొటోలు


ఇవి చూశారా?
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
- IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి
- బ్రిటన్ ప్రధానికి కొత్త చిక్కు!
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి జవాబులు
-
ఆరేళ్ల క్రితం ఒక యూనిట్ ఆధారిత బీమా పాలసీ (యులిప్) తీసుకున్నాను. ఏడాదికి రూ.80వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. దీన్ని ఇప్పుడు రద్దు చేసుకోవచ్చా? దీనికి బదులుగా నెలనెలా ఏదైనా పెట్టుబడి పెట్టేందుకు ప్రత్యామ్నాయ పథకాలను సూచించండి?
సాధారణంగా యూనిట్ ఆధారిత బీమా పాలసీలకు అయిదేళ్ల లాకిన్ వ్యవధి ఉంటుంది. మీరు పాలసీ తీసుకొని, ఆరేళ్లు అయ్యింది కాబట్టి, ఎలాంటి రుసుములు లేకుండానే పాలసీని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుబడి కోసం ఈక్విటీ ఫండ్లను ఎంచుకుంటే.. ఇప్పుడు మార్కెట్ తక్కువగా ఉంది కాబట్టి, లాభం తక్కువగా ఉండొచ్చు. మార్కెట్ పూర్తిగా కోలుకునే దాకా వేచి చూడండి. ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బుతో అవసరం లేకపోతే.. రెండుమూడేళ్లు ఆగి తీసుకోండి. ముందుగా తగినంత మొత్తానికి బీమా తీసుకోండి. పెట్టుబడి కోసం హైబ్రీడ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించండి. -
నా వయసు 48. ప్రైవేటు ఉద్యోగిని. జీతం రూ.లక్ష. నెలకు సుమారు రూ.20 వేలు వివిధ పథకాల్లో మదుపు చేస్తున్నాను. దీనికి పీఎఫ్ అదనం. 58 ఏట నుంచి నెలకు రూ. లక్ష (పన్ను లేకుండా) రావాలంటే నా దగ్గర ఎంత మొత్తం ఉండాలి? దీనికోసం ఏం చేయాలి?
మీరు సుమారు 20 శాతం పన్ను శ్లాబులో ఉంటారని అనుకుందాం. అప్పుడు పన్ను తర్వాత మీకు నెలకు రూ.లక్ష అందాలంటే.. వార్షిక ఆదాయం రూ.15లక్షల వరకూ ఉండాలి. అప్పుడు రూ.3లక్షలు పన్ను పోను, నెలకు రూ.లక్ష చొప్పున అందుకోవచ్చు. మీ దగ్గర ఉన్న డబ్బు 6శాతం రాబడిని ఆర్జించేలా చూసుకుంటే.. పదేళ్ల తర్వాత రూ.2.5 కోట్ల నిధి ఉంటేనే ఇది సాధ్యం. 8 శాతం రాబడిచ్చే పథకాల్లో మదుపు చేస్తే రూ.1.87 కోట్లు అవసరం. ఇప్పటికే మీ దగ్గర ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు లేవు. ఇప్పటి నుంచి పదేళ్లలో రూ.2.5 కోట్లు జమ చేయాలంటే.. నెలకు రూ.125,000 మదుపు చేయాలి. రూ.1.87 కోట్లు కావాలంటే.. నెలకు రూ.93,500 కావాలి. ఈ పెట్టుబడిని 11 శాతం రాబడినిచ్చే పథకాలకు మళ్లించాలి. ఇప్పటికే మీ పీఎఫ్‌లో మంచి మొత్తం జమ అయి ఉంటుంది. పదవీ విరమణ నాటికి ఇది మరింత పెరుగుతుంది. కాబట్టి, ఇప్పుడు మీరు చేస్తున్న రూ.20 వేల పెట్టుబడిని మీ మిగులు మొత్తాన్ని బట్టి, పెంచుకునే ప్రయత్నం చేయండి. రిటైర్ అయ్యాక మొత్తం డబ్బును అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మదుపు చేసి, నెలనెలా రాబడిని అందుకునే ఏర్పాటు చేసుకోవచ్చు.