close
BETA SITE

పాఠశాలల్లో పారిశుద్ధ్యం భేష్‌! 

భారత్‌లో పరిస్థితిపై ఐరాస నివేదిక

ఐరాస: పాఠశాలల్లో టాయ్‌లెట్లు తదితర పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన విషయంలో భారత్‌ మంచి పురోగతి కనబరచిందని ఐరాస తన తాజా నివేదికలో పేర్కొంది. ‘డ్రింకింగ్‌ వాటర్‌, శానిటేషన్‌ అండ్‌ హైజీన్‌ ఇన్‌ స్కూల్స్‌: 2018 గ్లోబల్‌ బేస్‌లైన్‌ రిపోర్ట్‌’ పేరుతో ఐరాసకు చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, బాలల నిధి సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమం (జేఎంపీ) ఈ నివేదికను రూపొందించాయి. 
పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడంలో భారత్‌ మంచి పురోగతి సాధించింది. 2000 నుంచి 2016 మధ్య కాలంలో.. ఎలాంటి పారిశుద్ధ్య సౌకర్యంలేని బడుల నిష్పత్తి వేగంగా తగ్గింది. ఈ తగ్గుదల.. జనాభాలో బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలుకుతున్నవారి సంఖ్య కన్నా ఎక్కువగా ఉంది. 
2016లో భారత్‌లోని దాదాపుగా అన్ని పాఠశాలల్లోనూ ఏదో ఒక రకమైన పారిశుద్ధ్య వసతులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 10 ఏళ్ల కిందట దాదాపు సగం మేర పాఠశాలల్లోనూ ఎలాంటి వసతులు లేవు. 2000 నుంచి 2016 మధ్య కాలంలో బడికి వెళ్లే చిన్నారుల సంఖ్య 35.2 కోట్ల నుంచి 37.8 కోట్లకు పెరిగింది. 
శానిటరీ వస్తువులను పారేయడానికి మూతలతో కూడిన చెత్త కుండీలు కలిగిన పాఠశాలల నిష్పత్తి.. ఒక్కోచోట ఒక్కోలా ఉంది. చండీగఢ్‌లో 96 శాతంగా, ఛత్తీస్‌గఢ్‌లో 36 శాతంగా ఉంది. శానిటరీ వ్యర్థాలను నాశనం చేయడానికి ఇన్సినరేటర్‌ సౌకర్యం కలిగిన రాష్ట్రం మిజోరం. 
రుతుక్రమ పరిశుభ్రతపై జాతీయ మార్గదర్శకాలను భారత్‌ 2015లో జారీ చేసింది. అయితే మూడింట రెండొంతుల మేర పాఠశాలలు మాత్రమే ఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు 2016-17లో జరిగిన అధ్యయనంలో తేలింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.